ప్రపంచంలోని 10 అతిపెద్ద క్రికెట్ స్టేడియాలు

Gourav Pilania
Cricket Expert

క్రికెట్ కేవలం ఆట కాదు; ఇది ఒక వేడుక. ఒక ఉత్సవం. ఒక సంప్రదాయం. మరియు చాలా మందికి ఒక జీవన విధానం, ఒక జీవన ఆధారం. ఈ అనుభవాన్ని మరింత చిరస్మరణీయం చేసేది ఏంటంటే, అసలు క్రికెట్ జరిగే స్టేడియాల మహోన్నత వైభవము. మరి ప్రపంచంలోనే అతి పెద్ద క్రికెట్ స్టేడియం ఏది అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా?

ప్రపంచంలోని ఉన్నతమైన 10 అతిపెద్ద క్రికెట్ స్టేడియాలను ఇప్పుడు మనం చూద్దాం. వాటి అద్భుతమైన సామర్థ్యం, ​​అసామాన్య చరిత్ర మరియు క్రికెట్‌లో ఆ స్టేడియాలు పోషిస్తున్న కీలక పాత్రను ప్రత్యేకంగా చూద్దాము.

క్రికెట్ స్టేడియం

సీటింగ్ సామర్థ్యం ప్రకారం ఉన్నత్తమైన 10 అతిపెద్ద క్రికెట్ స్టేడియాలు

ర్యాంక్ - శ్రేణి స్టేడియం లొకేషన్ దేశం సామర్థ్యం
1 నరేంద్ర మోదీ స్టేడియం అహ్మదాబాద్, గుజరాత్‌ భారతదేశం 132,000
2 మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (MCG) మెల్బోర్న్, విక్టోరియా‌ ఆస్ట్రేలియా 100,024
3 ఈడెన్ గార్డెన్స్ కోల్‌కతా, పశ్చిమ బెంగాల్‌ భారతదేశం 68,000
4 షహీద్ వీర్ నారాయణ్ సింగ్ రాయ్‌పూర్, ఛత్తీస్‌గఢ్‌ భారతదేశం 65,000
5 పెర్త్ స్టేడియం పెర్త్, పశ్చిమ ఆస్ట్రేలియా‌ ఆస్ట్రేలియా 61,266
6 అడిలైడ్ ఓవల్ అడిలైడ్, దక్షిణ ఆస్ట్రేలియా‌ ఆస్ట్రేలియా 53,583
7 గ్రీన్ ఫీల్డ్ ఇంటర్నేషనల్ స్టేడియం తిరువనంతపురం, కేరళ‌ భారతదేశం 50,000
8 భారతరత్న శ్రీ అటల్ బిహారీ వాజ్‌పేయి ఏకనా క్రికెట్ స్టేడియం లక్నో, ఉత్తరప్రదేశ్ భారతదేశం 50,000
9 బ్రబౌర్న్ స్టేడియం ముంబై, మహారాష్ట్ర భారతదేశం 50,000
10 డాక్లాండ్స్ స్టేడియం మెల్బోర్న్, విక్టోరియా ఆస్ట్రేలియా 48,003

1. నరేంద్ర మోదీ స్టేడియం, అహ్మదాబాద్, భారత్

గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఉన్న "నరేంద్ర మోదీ స్టేడియం" ప్రపంచంలోనే అతి పెద్ద క్రికెట్ స్టేడియంగా గుర్తింపు పొందింది. 1,32,000 మంది ప్రేక్షకులకు సీటింగ్ సామర్థ్యంతో ఇది ఆధునిక శిల్పకళ మరియు రూపకల్పనలో ఒక అద్భుతంగా నిలిచింది.

ఇదివరకు, సర్దార్ పటేల్ స్టేడియంగా పిలువబడిన ఈ స్టేడియం, 2020లో పునర్నిర్మాణం పూర్తి చేసి తిరిగి ప్రారంభించబడింది. ఐపీఎల్ ఫైనల్స్ నుండి అంతర్జాతీయ మ్యాచ్‌ల వరకు అనేక ప్రతిష్ఠాత్మక కార్యక్రమాలకు వేదికగా నిలిచింది ఈ స్టేడియం. ఇది భారత దేశ క్రికెట్‌కు ఒక ప్రధాన కేంద్రంగా మారింది.

ఈ మైదానం అనేక రికార్డులను చూసింది. వీటిలో ప్రముఖంగా, వన్డేల్లో రోహిత్ శర్మ యొక్క డబుల్ సెంచరీ, మరియు 2021లో భారత్ - ఇంగ్లాండ్ మధ్య జరిగిన ఉత్తేజకరమైన పింక్ బాల్ టెస్ట్ ఉన్నాయి. అనుకోని నాటకీయ సంఘటనల వలన, ఈ పింక్ బాల్ టెస్ట్, రెండు రోజులలోనే ముగిసింది, అహ్మదాబాద్, గుజరాత్‌లో ఉన్న నరేంద్ర మోదీ స్టేడియం ప్రపంచంలోని అతి పెద్ద క్రికెట్ స్టేడియంగా గుర్తింపు పొందింది.

1,32,000 మంది ప్రేక్షకులకు సీటింగ్ సామర్థ్యంతో ఇది ఆధునిక శిల్పకళ మరియు రూపకల్పనలో ఒక అద్భుతంగా నిలిచింది. ఇదివరకు, సర్దార్ పటేల్ స్టేడియంగా పిలువబడిన ఈ స్టేడియం, 2020లో పునర్నిర్మాణం పూర్తి చేసి తిరిగి ప్రారంభించబడింది. ఐపీఎల్ ఫైనల్స్ నుండి అంతర్జాతీయ మ్యాచ్‌ల వరకు అనేక ప్రతిష్ఠాత్మక కార్యక్రమాలకు వేదికగా నిలిచింది ఈ స్టేడియం. ఇది భారత దేశ క్రికెట్‌కు ఒక ప్రధాన కేంద్రంగా మారింది.



2. మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (MCG), మెల్బోర్న్, ఆస్ట్రేలియా

1853లో నిర్మించిన మెల్‌బోర్న్ క్రికెట్ మైదానం, అతి పురాతనమైన మరియు అత్యంత ప్రసిద్ధమైన స్టేడియంలలో ఒకటి. 100,024 మంది కూర్చునే సామర్థ్యంతో, MCG (ఎంసీజీ), 1956 ఒలింపిక్స్ మరియు క్రికెట్ ప్రపంచ కప్ ఫైనల్స్ వంటి చారిత్రాత్మక కార్యక్రమాలకు వేదికగా నిలిచింది. ఇది ఆస్ట్రేలియా యొక్క గొప్ప క్రీడా సంస్కృతికి చిహ్నం.

ఇంగ్లండ్‌పై షేన్ వార్న్ చేసిన మరపురాని హ్యాట్రిక్ మరియు 2015 ICC వరల్డ్ కప్ ఫైనల్‌ సమయంలో అసంఖ్యాకంగా తరలి వచ్చిన ప్రేక్షకుల సంఖ్య ఈ స్టేడియంలో మరపురాని క్షణాలు.

3. ఈడెన్ గార్డెన్స్, కోల్‌కతా, భారతదేశం

1864లో స్థాపించబడిన ఈడెన్ గార్డెన్స్ తరచుగా "భారత క్రికెట్ యొక్క మక్కా" గా పిలువబడుతుంది. 68,000 మంది సీటింగ్ సామర్థ్యంతో, ఇది ఎన్నో ప్రతిష్టాత్మకమైన మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇచ్చింది. మరియు ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రసిద్ధిగాంచిన క్రికెట్ మైదానాల్లో ఒకటిగా ఈ స్టేడియం నిలిచింది.

ఈ స్టేడియం 1987 వరల్డ్ కప్ ఫైనల్ కు మరియు ఆస్ట్రేలియాతో జరిగిన ప్రఖ్యాత 2001 టెస్ట్ మ్యాచ్‌కు ఆతిథ్యం ఇచ్చింది. ఇక్కడే VVS లక్ష్మణ్ మరియు రాహుల్ ద్రవిడ్ చారిత్రాత్మకంగా పునరాగమనించారు.

4. షహీద్ వీర్ నారాయణ్ సింగ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం, రాయ్‌పూర్, భారతదేశం

ఛత్తీస్‌గఢ్‌లోని రాయపూర్ లో గల, ఈ స్టేడియం 65,000 సీట్ల సామర్థ్యం కలిగి ఉంది. 2008లో ప్రారంభమైన ఈ స్టేడియం, "ఐపీఎల్ మ్యాచ్‌లు" మరియు "రహదారి భద్రత వరల్డ్ సిరీస్" (రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్‌) లకు ఆతిథ్యమిచ్చింది. ఇది భారతదేశం యొక్క అభివృద్ధి చెందుతున్న క్రికెట్ మౌలిక సదుపాయాలకు నిదర్శనంగా నిలుస్తుంది.

సచిన్ టెండూల్కర్ యొక్క 'రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్' జట్టుకు ఆతిథ్యమిచ్చి ఈ స్టేడియం ఒక కేంద్ర బిందువుగా మారింది. ఈ కార్యక్రమంతో, క్రికెట్ ప్రపంచంలో తన స్థానాన్ని ఈ స్టేడియం మరింత బలపరుచుకుంది.

5. పెర్త్ స్టేడియం, పెర్త్, ఆస్ట్రేలియా

2018లో ప్రారంభించబడిన పెర్త్ స్టేడియంని, "ఆప్టస్ స్టేడియం" అని కూడా పిలుస్తారు. దీని సీటింగ్ సామర్థ్యం 61,266. WACA ని తన స్థానం నుంచి తప్పించిన ఒక ఆధునిక సదుపాయం, ఈ స్టేడియం. ప్రస్తుతం పశ్చిమ ఆస్ట్రేలియాలో క్రికెట్ మరియు ఇతర ముఖ్యమైన కార్యక్రమాల కోసం ప్రాముఖ్యమైన వేదికగా ఈ స్టేడియం ఉపయోగించబడుతుంది.

అత్యాధునిక సౌకర్యాలకు ప్రసిద్ధి చెందిన ఈ స్టేడియం, "బిగ్ బాష్ లీగ్" గేమ్‌లు మరియు భీకరమైన "యాషెస్ టెస్ట్" సిరీస్‌లకు ఆతిథ్యం ఇచ్చింది.

6. అడిలైడ్ ఓవల్, అడిలైడ్, ఆస్ట్రేలియా

53,583 సీటింగ్ సామర్థ్యంగల స్టేడియం, అడిలైడ్ ఓవల్. ఈ స్టేడియం, సుందరమైన పరిసరాలుకు మరియు ప్రతిష్టాత్మకమైన క్రికెట్ చరిత్రకు ప్రసిద్ధి చెందింది. 1871లో స్థాపించబడిన ఈ స్టేడియం, డే అండ్ నైట్ టెస్ట్ మ్యాచ్‌లకు ఎంతో అనుకూలమైనది.

2015లో తొలిసారిగా జరిగిన డే అండ్ నైట్ టెస్ట్ మ్యాచ్, ఈ స్టేడియం యొక్క ప్రత్యేక సంఘటనలలో ఒకటి. ఇది క్రికెట్ ఫార్మాట్‌ను విప్లవాత్మకంగా మార్చి, పెద్ద సంఖ్యలో ప్రేక్షకులను ఆకర్షించింది.

7. గ్రీన్ ఫీల్డ్ ఇంటర్నేషనల్ స్టేడియం, తిరువనంతపురం, భారతదేశం

కేరళలోని ఈ పర్యావరణ స్నేహపూర్వక స్టేడియం 50,000 సీట్ల సామర్థ్యం కలిగి ఉంది. ఈ స్టేడియం, భారతదేశంలో పర్యావరణ-స్థిరత్వాన్ని ప్రాముఖ్యంగా దృష్టిలో పెట్టుకుని రూపొందించిన మొట్టమొదటి వేదిక. ఈ స్టేడియంను క్రికెట్, ఫుట్‌బాల్, మరియు సాంస్కృతిక కార్యక్రమాల కోసం ఉపయోగిస్తారు.

ఈ మైదానం 2017లో, తన మొట్టమొదటి టీ20 ఇంటర్నేషనల్‌ను, భారతదేశం మరియు న్యూజిలాండ్ ల మధ్య నిర్వహించింది. పచ్చని పరిసరాలు మరియు అత్యాధునిక సౌకర్యాలతో ఈ స్టేడియం అభిమానులను ఆకట్టుకుంది.

8. భారతరత్న శ్రీ అటల్ బిహారీ వాజ్‌పేయి ఏకనా క్రికెట్ స్టేడియం, లక్నో, భారతదేశం

50,000 మంది సీటింగ్ సామర్థ్యం కలిగిన ఈ అత్యాధునిక స్టేడియం లక్నోలో ఉన్నది. ఇది అనతికాలంలోనే, IPL మరియు అంతర్జాతీయ మ్యాచ్‌లకు ప్రముఖ వేదికగా మారింది.

2019 లో జరిగిన ఆఫ్గానిస్తాన్-వెస్ట్ ఇండీస్ సిరీస్, ఈ స్టేడియంలో చోటుచేసుకున్న ఒక మధురమైన సంఘటన. ఇందులో ఆఫ్గానిస్తాన్ తమ తొలి "హోమ్" టెస్ట్ మ్యాచ్ ను ఆడింది. ఇది ఒక చారిత్రక క్షణంగా నిలిచిపోయింది.

9. బ్రబౌర్న్ స్టేడియం, ముంబై, భారతదేశం

ముంబైలోని బ్రబౌర్న్ స్టేడియం సీటింగ్ సామర్థ్యం 50,000. ఈ స్టేడియం, భారతదేశ క్రికెట్ చరిత్రలో ప్రాచీన ఆకర్షణకు మరియు ప్రాముఖ్యతకు ప్రసిద్ధి చెందింది. ఇది దేశీయ మరియు అంతర్జాతీయ ఆటలకు ఇంకా ఆతిథ్యం ఇస్తూనే ఉంది.

1933లో భారతదేశంలో మొదటి టెస్ట్ మ్యాచ్‌కు ఆతిథ్యమిచ్చినందుకు ఈ స్టేడియం ప్రసిద్ధి చెందింది. మరియు పాత జ్ఞ్యాపకాలకు చిహ్నంగా నిలిచిపోయిన ఈ స్టేడియం యొక్క మరపురాని వాతావరణం ఇంకా ప్రజల మనసులో స్మరించబడుతుంది.

10. డాక్లాండ్స్ స్టేడియం, మెల్బోర్న్, ఆస్ట్రేలియా

"మార్వెల్ స్టేడియం" గా పిలువబడే డాక్‌ల్యాండ్స్ స్టేడియం మెల్బోర్న్‌లో ఉంది. ఈ స్టేడియం 48,003 మంది కూర్చునే సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఈ స్టేడియం యొక్క వైవిధ్యత, మరియు ఇది ఉన్న ప్రదేశం కారణంగా, ఇక్కడ క్రికెట్ మరియు అనేక ఇతర కార్యక్రమాలకు ఇది కీలక వేదికగా మారింది.

ఈ స్టేడియంకి ఉన్న ప్రత్యేకత, దాని పైకప్పు. ఇది ముడుచుకుపోయి, విప్పుకుపోయే వెసులుబాటు గల కప్పు. ఈ కప్పు విప్పుకుపోయి ఉన్నప్పుడు, ఇది ప్రాంగణం అంతా విస్తరించి ఉంటుంది. ఇందువల్ల, వర్షం సమయంలో కూడా మ్యాచ్‌లు అంతరాయం లేకుండా కొనసాగించడానికి వీలుగా ఉంటుంది. మరియు అనేక ఉత్కంఠకరమైన టి20 మ్యాచ్‌లకు ఈ స్టేడియం ఆతిథ్యమిచ్చింది.

ఏ దేశంలో అత్యధిక క్రికెట్ స్టేడియంలు ఉన్నాయి?

భారతదేశం 50కి పైగా అంతర్జాతీయ క్రికెట్ స్టేడియాలతో ప్రపంచంలోనే అగ్రగామి దేశంగా నిలుస్తుంది. ఇది క్రికెట్ పట్ల భారత్ కు ఉన్న అపారమైన ప్రేమ మరియు ఉత్సాహాన్ని ప్రతిబింబిస్తుంది. భారీ ప్రాంగణాల నుండి చిన్న మైదానాల వరకు, ప్రతి స్టేడియం, దేశం యొక్క క్రికెట్ ప్రయాణంలో ఒక కీలక పాత్రను పోషిస్తుంది.

ముగింపు

అద్భుతమైన నరేంద్ర మోడి స్టేడియం నుండి, ప్రతిష్టాత్మక MCG మరియు ఈడెన్ గార్డెన్స్ వరకు, ఈ వేదికలు అన్నీ కేవలం క్రికెట్ ప్రాంగణాలు మాత్రమే కాదు. ఇవి క్రికెట్ ఘన చరిత్రను నిర్వచించే క్షణాలను చవి చూసిన మహోన్నతమైన ప్రదేశాలు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులను ఇంకా ఇవి ఆకర్షిస్తూనే ఉన్నాయి. ఈ ప్రఖ్యాత స్టేడియాల్లో మీరు సందర్శించాలనుకునే వేదిక ఏది?

మా సంఘంలో చేరండి మరియు ఉచిత ఫీచర్లను కనుగొనండి.

మీ ఫాంటసీహీరో అనుభవాన్ని ప్రారంభించండి. ఎప్పుడైనా రద్దు చెయ్యచ్చు